రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం
- బొలీవియాలోని పొటోసీలో ఘటన
- మరో 39 మందికి గాయాలు
- అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు
ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.