ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బట్లర్... కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్...?

jos buttler stepped down from england captaincy
  • వరుస పరాజయాలతో కీలక నిర్ణయం ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్
  • భారత్‌తో ఇటీవల జరిగిన టీ 20, వన్డే సిరీసుల్లోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం 
  • కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని వెల్లడి
చాంపియన్ ట్రోఫీలో ఇంగ్లండ్ టీమ్ దారుణ వైఫల్యంతో పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశారు. కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు బట్లర్ శుక్రవారం ప్రకటించాడు. వరుస పరాజయాల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

ఇటీవల భారత్ తో జరిగిన టీ 20, వన్డే సిరీసుల్లోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ పరిణామాలే బట్లర్ రాజీనామా నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు బట్లర్ ప్రకటించాడు.  
 
తాను కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని, జట్టులో ఎప్పటి లాగానే కొనసాగుతానని పేర్కొన్న జోస్ బట్లర్ .. కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌తో కలిసి వేరే ప్లేయర్ జట్టును ముందుకు నడిపిస్తారని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించడం తన జీవితంలో గర్వకారణమని అన్నాడు.

బట్లర్ జట్టు నాయకత్వం నుంచి పక్కకు తప్పుకున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌ను నియమిస్తారనే వార్తలు వినబడుతున్నాయి.  
Go Back to Shorts
Jos Buttler
Team England
Sports News
Cricket News

More Telugu News