అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు
- చరిత్రలో ఇదే ఫస్ట్ ఫొటో అంటున్న నిపుణులు
- భూమితో పాటు మొత్తం 8 గ్రహాలను కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్
- అంతరిక్షంలో ప్లానెటరీ పరేడ్ సమయంలో తీసిన ఫొటో
ఫొటో ఎలా తీశాడంటే..
అంతరిక్ష ఫొటోగ్రాఫర్ గా పేరొందిన జోష్ డ్యూరీ ఈ నెల 22న జరిగిన ప్లానెటరీ పరేడ్ ను కెమెరాలో బంధించేందుకు ఇంగ్లాండ్ లోని సోమర్ సెట్ అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడి మెండిప్ హిల్స్ కొండల పైనుంచి విశాలమైన ఆకాశం బాగా కనిపిస్తుంది. మొత్తం ఏడు గ్రహాలను ఒకే ఫొటోలో బంధించేందుకు పనోరమా మోడ్ ను ఉపయోగించినట్లు డ్యూరీ చెప్పారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధుడిని అలాగే నెఫ్ట్యూన్, శాటర్న్ గ్రహాలను గుర్తించడంలో కాస్త ఇబ్బంది పడినట్లు వివరించారు. అయితే, ఇమేజ్ అనాలసిస్, ఆస్ట్రానమీ యాప్ ల సాయంతో గ్రహాలను గుర్తించానని తెలిపారు. పనోరమా మోడ్ లో ఫిష్ ఐ లెన్స్ ల సాయంతో ఏడు గ్రహాలను ఒకే ఫ్రేమ్ లో బంధించినట్లు డ్యూరీ వివరించారు.