పేర్ని నాని భార్య అకౌంట్లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకు వస్తుంది: కొల్లు రవీంద్ర
- పోసానిని చట్టబద్ధంగానే అరెస్ట్ చేశారన్న కొల్లు రవీంద్ర
- ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా మాట్లాడారని మండిపాటు
- వైసీపీ నేతల పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని వ్యాఖ్య
రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ లోపలకు పంపించేవాళ్లమని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫ్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు. ఆయన భార్య జయసుధ అకౌంట్ లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. కాకినాడ షిప్పుల్లో బియ్యం అక్రమంగా ఎలా రవాణా అయిందో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు.