తెలంగాణ ప్రజలపై శివుడి దీవెనలు ఉండాలి: కేసీఆర్ శివరాత్రి శుభాకాంక్షలు
- ముల్లోకాలను కాపాడుతున్న శివుడి కరుణా కటాక్షాలు తెలంగాణ మీద ఉండాలన్న కేసీఆర్
- ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని ప్రార్థించిన కేసీఆర్
- కేటీఆర్, హరీశ్ రావు పండుగ శుభాకాంక్షలు
గరళాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ శివుడి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ప్రార్థించారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
"ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా శివుడిని కొలిచే పర్వదినం మహా శివరాత్రి. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూ సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
పరమశివుని ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీశ్ రావు ట్వీట్ చేశారు.