బ్లాక్ మండే... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్లాక్ మండే... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Sensex losses 856 points
  • మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ భయాలు
  • 856 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 242 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లను మరో బ్లాక్ మండే కుప్పకూల్చింది. ట్రంప్ టారిఫ్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరయింది.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454కి పడిపోయింది. నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 4 పైసలు క్షీణించి రూ. 86.72 వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.58%), కోటక్ బ్యాంక్ (0.64%), మారుతి (0.25%), నెస్లే ఇండియా (0.24%), ఐటీసీ (0.21%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.32%), జొమాటో (-3.32%), టీసీఎస్ (-2.93%), ఇన్ఫోసిస్ (-2.81%), భారతి ఎయిర్ టెల్ (-2.29%).
Advertisement
Stock Market
Sensex
Nifty

More Telugu News