యాదవ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends a wedding near Tirupati
  • తూకివాకం సమీపంలోని ఆర్ పీఆర్ కల్యాణ మండపంలో పెళ్లి
  • వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు
  • చంద్రబాబు రాకతో పెళ్లి వేడుకలో కోలాహలం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి లోక్ సభ స్థానం టీడీపీ ఇన్చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు విచ్చేశారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు... తూకివాకం సమీపంలోని ఆర్.పీ.ఆర్ కల్యాణమండపానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ వర్గాలు స్వాగతం పలికాయి. 

వధూవరులు చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫొటోలు దిగారు. ఈ వివాహ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా హాజరయ్యారు.
Advertisement
Chandrababu
Wedding
Tirupati
TDP

More Telugu News