ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్లో భారత జాతీయ గీతాలాపన.. వీడియో ఇదిగో!
- లాహోర్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్
- మ్యాచ్కు ఇరు జట్ల జాతీయ గీతాలాపన
- ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులు భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వైనం
- ఆ వెంటనే తప్పు సరిదిద్దుకున్న పాక్ బోర్డు
- సోషల్ మీడియాలో పాక్ బోర్డుపై ట్రోల్స్
చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఇండియా ఆడే మ్యాచ్లు దుబాయ్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైన పాకిస్థాన్.. నేడు భారత్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించి ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు, ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కూడా. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.