కరోనా లాంటిదే... చైనాలో మరో వైరస్ గుర్తింపు
- కరోనా లాంటి వైరస్‌ను గబ్బిలాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు
- ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు
- కోవిడ్ 19తో పోలిస్తే తక్కువ సామర్థ్యం ఉన్న వైరస్‌గా వెల్లడి
గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ ఝెంగ్ లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనకు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్‌లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్ మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్ – కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) ఉప రకానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని హెచ్‌కెయూ 5 కరోనా సంతతికి చెందినదిగా చెబుతున్నారు.