కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్తలో ఊరట
- భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
- అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవన్న లోకాయుక్త పోలీసులు
- తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న లోకాయుక్త పోలీసులు
ముడా భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య పార్వతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు పోలీసులు లేఖ రాశారు.
ఈ కేసులో మొదటి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు. నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. తదుపరి దర్యాఫ్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.