ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు, రైతులు!
- ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
- సినీ, పారిశ్రామిక ప్రముఖులు, ఇతర దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానం
- హాజరు కానున్న బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా భాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి
ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. వీరే కాకుండా, ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, మురికివాడల నివాసితులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా భాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి హాజరు కానున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేపు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై, శాసనసభా పక్ష నేతను, మంత్రులను ఎన్నుకోనుంది.