సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు. సివిల్ సర్వెంట్ల నినాదం 'ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్'. 'ఏసీ అండ్ ఇనాక్షన్' కాదు. వారి గురించి సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు కించపరిచేలా, అమర్యాదకరంగా ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నా" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.