Advertisement

కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy on new ration cards
  • అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలన్న ముఖ్యమంత్రి
  • ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కార్డులు జారీ చేయాలన్న ముఖ్యమంత్రి
  • కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీ చేయాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు డిజైన్లను పరిశీలించారు.

కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారితో పాటు తమ రేషన్ కార్డులో కొత్తగా సభ్యులను చేర్చేందుకు కూడా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Advertisement
Revanth Reddy
Ration card
Telangana
Congress

More Telugu News