బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. ఆదివారం వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు
- వారం రోజులుగా ఇదే పరిస్థితి అంటూ వ్యాపారుల ఆవేదన
- అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గని వైనం
- మటన్, చేపలకు పెరిగిన డిమాండ్
ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పెరుగుతున్నా చికెన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. కిందటి వారం కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 ఉండగా.. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 కి అమ్ముతున్నారు. చికెన్ అమ్మకాలు పడిపోవడం, గిరాకీ పెరగడంతో చేపల వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు.