పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- మృతులను ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తింపు
- కారును ఢీకొన్న లారీ
- పల్నాడు జిల్లా నెమలిపురి వద్ద ఘటన
వీరు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.