Somu Veerraju: హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు: సోము వీర్రాజు

Somu Veerraju slams Jagan over poll assuarances
షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని తెలిపారు. 

బటన్ నొక్కి హామీలు అమలు చేసిన జగన్ కు ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో తెలియదా? అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఢిల్లీలో ప్రజల తీర్పులు గమనించాలని... ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు ఆరోపణలు సరికాదు అని హితవు పలికారు.
Go Back to Shorts
Somu Veerraju
Jagan
BJP
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News