ట్రక్ ను ఢీ కొట్టి మంటల్లో చిక్కుకున్న బస్సు.. మెక్సికోలో 41 మంది సజీవ దహనం
--
బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఎనిమిది మంది మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో జరిగిందీ ఘోర ప్రమాదం. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ టీమ్.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించింది. బస్సులో 18 మంది ప్రయాణికులకు సంబంధించిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.