FlixBus: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

EV Buses between Hyderabad and Vijayawada
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. 

సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. 
Go Back to Shorts
FlixBus
Hyderabad
Vijayawada
Visakhapatnam

More Telugu News