Marriage: త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెస‌ర్ కీల‌క నిర్ణ‌యం!

Marriage with Student in The Classroom is Sensational Decision of The Lady Professor
షార్ట్స్‌లో చూడండి
ప‌శ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబుల్‌క‌లాం ఆజాద్ యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్నాల‌జీ త‌ర‌గ‌తి గ‌దిలో మ‌హిళా ప్రొఫెస‌ర్ ఓ విద్యార్థితో పెళ్లి చేసుకోవ‌డం వైర‌లైన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ పూల దండలు మార్చుకుని, లేడీ ప్రొఫెస‌ర్ నుదు‌ట విద్యార్థి బొట్టు పెట్టాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో స్పందించిన వ‌ర్సిటీ యంత్రాంగం విచార‌ణ‌కు ఆదేశించింది. అలాగే ఆమెను అధికారులు సెల‌వుపై పంపారు. 

ఈ నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ తాజాగా త‌న రాజీనామా లేఖ‌ను రిజిస్ట్రార్ పార్థ‌కు పంపించారు. తాను మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నాన‌ని, విధుల్లో కొన‌సాగ‌లేన‌ని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై విశ్వ‌విద్యాల‌యం త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోనుంది. కాగా, ఆ పెళ్లి తంతు ఓ ప్రాజెక్టులో భాగ‌మ‌ని ప్రొఫెస‌ర్ చెబుతున్నారు.     
Go Back to Shorts
Marriage
Lady Professor
Student
West Bengal

More Telugu News