అందుకే సినిమాలకి దూరమయ్యాను: 'చిత్రం' బబ్లూ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే సినిమాలకి దూరమయ్యాను: 'చిత్రం' బబ్లూ!

Comedian Babloo Interview
  • చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన సదానంద్ 
  • 'బబ్లూ' పేరుతో పాప్యులర్ అయిన నటుడు
  • 'చిత్రం' సినిమాతో పెరిగిన క్రేజ్  
  • చాలా కాలం పాటు డిప్రెషన్ లో ఉండిపోయానని వెల్లడి
  • ఇప్పుడు సినిమాలు చేయడానికి సిద్ధమని వివరణ
'చిత్రం' సినిమా చూసినవారెవరూ అందులోని 'బబ్లూ' పాత్రను మరిచిపోలేరు. ఆ సినిమాలో ఆయనపై చిత్రీకరించిన 'ఆ అమెరికా అమ్మాయి మావో' సాంగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. అలాంటి బబ్లూ తెరపై కనిపించక చాలాకాలమే అయింది. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించాడు. 

"చైల్డ్ ఆర్టిస్టుగా నా కెరియర్ 'ముద్దుల మేనల్లుడు' సినిమాతో మొదలైంది. ఆ తరువాత చాలానే సినిమాలు చేశాను. నా అసలు పేరు 'సదానంద్'.  జంధ్యాల గారి 'పోపుల పెట్టె' సీరియల్ లో నేను చేసిన 'బబ్లూ' పాత్రనే నా పేరుగా మారిపోయింది. ఇక టీనేజ్ లోకి అడుగు పెట్టిన తరువాత 'చిత్రం' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా తరువాత ఫుల్ బిజీ అయ్యాను. పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ ల సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది" అని అన్నాడు. 

"లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉండగా, నా కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా కోల్పోతూ వచ్చాను. ఆ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అసలు ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం వలన, సినిమాలకు దూరమయ్యాను. ఆ తరువాత చేయాలనుకున్నప్పుడు నచ్చిన పాత్రలు రాలేదు. చిన్న పాత్రలే అయినా గుర్తింపు తెచ్చేవి అయితే చేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను" అని చెప్పాడు. 

Advertisement
Babloo
Comedian
Teja
Chitram Movie

More Telugu News