నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలుస్తున్నారంటూ బాధితుల ఆందోళన .. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత
- చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
- పోలీసు స్టేషన్లకు బాధితుల తరలింపు
- జీవో జారీ చేసి ఇళ్ల తొలగింపు ప్రక్రియను చేపట్టిన రెవెన్యూ అధికారులు
గ్రామం మధ్య నుంచి బైపాస్ తీసుకెళ్లడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లు కూలుస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోని సామగ్రిని సిబ్బంది రైతువేదిక, పీఏసీఎస్ గోడౌన్లకు తరలించారు. రెవెన్యూ అధికారులు జీవో జారీ చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు.