పనిగంటల అంశంపై కేంద్రం స్పందన
- పని గంటలను పెంచే ప్రతిపాదన లేదన్న కేంద్రం
- ఉద్యోగుల పని గంటల పెంపుపై పలువురు కార్పొరేట్ దిగ్గజాల వ్యాఖ్యలు
- లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈమేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని తెలిపారు.
చట్టాల అమలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (సీఐఆర్ఎం) తనిఖీ అధికారులు చూడగా, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు.