నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లికి పోటెత్తిన భక్తులు
అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. 7 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.