ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
- తనిఖీల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్ సీజ్
- డ్రగ్స్‌ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్ చేసే యత్నం
ముంబయి ఎయిర్ పోర్టులో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్లేందుకు ఈ కేటుగాడు యత్నించాడు. అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన అధికారులు ఆసుపత్రికి తరలించి వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్ ను వెలికి తీశారు. అయితే ఎక్కువగా విదేశీయులే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.