పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు పాఠశాలల్లో అల్పాహారం
- స్కూళ్లలో ప్రత్యేక తరగదులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు
- పరీక్షలు ముగిసే వరకు సాయంత్రం అల్పాహారం అందించాలని నిర్ణయం
- అబిడ్స్ స్కూల్లో స్నాక్స్ అందించిన ఉపాధ్యాయులు
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సాయంత్రం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు పాఠశాలలు నడిచే 38 రోజుల పాటు అల్పాహారం ఇవ్వనున్నారు.