కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన
- మహా కుంభమేళాలో విషాదం
- భారీ తొక్కిసలాటలో 15 మంది మృతి!
- ఈ ఘటన తీవ్ర విచారం కలిగించిందన్న చంద్రబాబు
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో విషాదకర రీతిలో తొక్కిసలాట తీవ్ర విచారాన్ని కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.