Hyderabad: మీర్‌పేటలో మహిళ హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

Shocking reveals in Meerpet wife murder case
  • మరో మహిళతో సంబంధం కారణంగా భార్యను చంపినట్లు పోలీసుల అనుమానం
  • మహిళ గురించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం
  • ఇప్పటి వరకు ఆధారాలు గుర్తించని పోలీసులు
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో పోలీసుల కీలక విషయాలను గుర్తించారు. మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే గురుమూర్తి భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి తన భార్యను చంపేసి, ముక్కలుగా నరికి, ఆ ముక్కలను ఉడికించి, ఎముకలను రోట్లో వేసి పొడి చేశాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా... ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

గురుమూర్తి సెల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో మరో మహిళ ఫొటోలు లభ్యమయ్యాయి. ఆ మహిళతో సంబంధం కారణంగానే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నెల 15న గురుమూర్తి, భార్య వెంకటమాధవి మధ్య ఆ మహిళ గురించి వాగ్వాదం చోటు చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

భార్య శవాన్ని పొడిగా చేసిన తర్వాత నిందితుడు జిల్లెలగూడ చెరువులో కలిపేసినట్లు పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు అక్కడ చూడగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

భార్య కనిపించడం లేదని గురుమూర్తి ఆమె తల్లిదండ్రులకు ఈ నెల 17న చెప్పాడు. మీర్‌పేటకు వచ్చిన ఆమె తల్లిదండ్రులు మరుసటి రోజు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ నెల 14న వెంకటమాధవి ఇంట్లోకి వచ్చినట్లుగా ఉంది. కానీ ఆ తర్వాత బయటకు వెళ్లినట్లుగా లేదు. ఆ తర్వాత గురుమూర్తిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. గురుమూర్తి చెప్పినచోట ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Hyderabad
Telangana
Andhra Pradesh
Crime News

More Telugu News