AP Fibernet: లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా రూ.100 కోట్ల పెనాల్టీలు మాఫీ చేస్తున్నాం: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి

AP Fibernet Chairman announces penalty waiver on cable operators on the account of Nara Lokesh birthday
  • ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం
  • కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పెనాల్టీలు వేశారని వెల్లడి
  • కనెక్షన్లపై అక్రమంగా రెంట్ వసూలు చేశారని ఆరోపణ
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్ల పెనాల్టీలు వేశారని, ఇవాళ నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ రూ.100 కోట్ల పెనాల్టీలు మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. కేబుల్ ఆపరేటర్లపై భారీ మొత్తంలో జరిమానాలు విధించడం వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విచారణ జరిపామని తెలిపారు. 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అద్దెకు సెట్ టాప్ బాక్సులు ఇచ్చారని, ప్రతి నెల కనెక్షన్ కు రూ.59 చొప్పున అక్రమంగా రెంట్ వసూలు చేశారని ఆరోపించారు. ఈ రెంట్లను కూడా రద్దు చేస్తున్నామని అన్నారు. 

ఫైబర్ నెట్  బాక్సుల సరఫరాకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావొచ్చని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఫైబర్ నెట్ ప్లాన్స్ ను సమీక్షిస్తున్నామని చెప్పారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ ను ప్రజలకు అందిస్తామని అన్నారు. పేదల కోసం ప్రత్యేకంగా ఫైబర్ నెట్ బేసిక్ ప్యాక్ ను ప్రవేశపెడామని వివరించారు. ప్రైవేటు రంగంతో పోల్చితే సగం ధరకే నాణ్యమైన సేవలు అందిస్తామని జీవీ రెడ్డి వెల్లడించారు. 

ఇక, తిరుమల కొండపై ఉచితంగా ఫైబర్ నెట్ సేవలు అందించాలని నిర్ణయించామని జీవీ రెడ్డి చెప్పారు.
AP Fibernet
GV Reddy
Nara Lokesh
Birthday
Cable Operators

More Telugu News