లోకేశ్‌కు త‌ల్లి భువ‌నేశ్వ‌రి, అర్ధాంగి బ్రాహ్మ‌ణి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు

Nara Bhuvaneswari and Nara Brahmani Birthday Wishes to Nara Lokesh
  • నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టిన‌రోజు
  • ఈ ఏడాది కూడా విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని భువ‌నేశ్వ‌రి ట్వీట్‌
  • 'హ్యాపీ బ‌ర్త్‌డే ల‌వ్ ఆఫ్ మై లైఫ్' అంటూ బ్రాహ్మ‌ణి పోస్ట్
ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మ‌ణి ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టులు పెట్టారు. 
 
"పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేశ్. మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఈ ఏడాది కూడా నీకు విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నానా!" అని భువ‌నేశ్వ‌రి ట్వీట్ చేశారు. 

"నాపై మీ ప్రేమ‌, అంకిత‌భావానికి కృత‌జ్ఞురాలిని. మీరు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మ‌న రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు. ఈ సంవ‌త్స‌రం కూడా మీకు అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. హ్యాపీ బ‌ర్త్‌డే ల‌వ్ ఆఫ్ మై లైఫ్" అని బ్రాహ్మ‌ణి పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Nara Bhuvaneswari
Nara Brahmani
Birthday Wishes

More Telugu News