ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
- బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దుపై తీవ్ర వ్యతిరేకత
- తొలిరోజు ట్రంప్ సంతకం.. మరుసటి రోజే కోర్టులో దావా
- అమలు చేయడం కష్టమేనంటున్న నిపుణులు
ఈ వ్యవహారంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అమెరికా రాజ్యాంగం ప్రకారం యూఎస్ఏలో జన్మించిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని చెప్పారు. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని జన్మహక్కుగా మార్చారని వివరించారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ట్రంప్ తన పరిధిని దాటారని ఆరోపించారు. కాగా, జన్మత: లభించే ఈ పౌరసత్వ హక్కును మార్చడం అంత సులభం కాదని అమెరికా రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఇప్పటికే 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కారణంగా రాజ్యాంగ సవరణ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.