తొలిరోజే పదిహేను వందల మందికి ట్రంప్ క్షమాభిక్ష.. ఎవరికంటే..!
- క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి నిందితులకు ఊరట
- ఎన్నికల ప్రచారంలో హామీ.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆదేశాలు
- 2020లో ట్రంప్ ఓటమిని తట్టుకోలేక హింసకు పాల్పడ్డ మద్దతుదారులు
ఈ ఘటనపై ఫెడరల్ పోలీసులు దాదాపు పదిహేను వందల మందిపై కేసులు నమోదు చేశారు. వారంతా ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి కేసులను మాఫీ చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. తాజాగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశాక అధ్యక్ష హోదాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రంప్ మద్దతుదారులకు ఊరట లభించింది.