TTD: టీటీడీకి రూ.6 కోట్ల భారీ విరాళం అందించిన చెన్నై భక్తుడు

Chennai businessman donates Rs 6 crore to TTD
  • తిరుమల వెంకన్నకు భారీ విరాళం
  • విరాళం చెక్కులను టీటీడీ అదనపు ఈవోకు అందించిన వర్ధమాన్ జైన్
  • ఎస్వీబీసీకి రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.1 కోటి విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ట్రస్టులకు ఏకంగా రూ.6 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ఎస్వీబీసీ (చానల్)కి రూ.5 కోట్లు, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. వర్ధమాన్ జైన్ విరాళం చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. వర్ధమాన్ జైన్ కుటుంబం గతంలోనూ టీటీడీకి భారీ విరాళాలు అందించినట్టు తెలుస్తోంది.
TTD
Vardhaman Jain
Donation
SVBC
Tirumala

More Telugu News