Suicide: నెల్లిమర్ల మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Student commits suicide in Nellimarla Medical College

  • విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ కాలేజీలో ఘటన
  • ఎంబీబీఎస్ సెకండియర్ లో పరీక్ష తప్పిన సాయి మణిదీప్
  • మానసికంగా కుంగుబాటుకు గురై బలవన్మరణం
  • సాయి మణిదీప్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైద్య కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థి పేరు అటుకూరి సాయి మణిదీప్. అతడి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. 24 ఏళ్ల సాయి మణిదీప్ నెల్లిమర్లలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 

ఎంబీబీఎస్ సెకండియర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇతర విద్యార్థులు ముందుకు వెళుతుంటే, తాను వెనుకబడిపోతున్నానంటూ మానసిక కుంగుబాటుకు లోనయ్యాడు. దాంతో, హాస్టల్ లోని తన గదిలో పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. 

ఇతర విద్యార్థులు గది తలుపులు తెరిచి చూడగా, సాయి మణిదీప్ అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో ఆ విద్యార్థులు కాలేజీ మేనేజ్ మెంట్ కు తెలియజేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అటు, సాయి మణిదీప్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News