బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
- బ్యాంకు ఖాతాకు నామినీని తప్పనిసరి చేసిన ఆర్బీఐ
- నామినీ జోడించని ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తింపు
- దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిక
ఖాతాలకు నామినీని జోడించకపోవడం వల్ల భవిష్యత్తులో ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉందని, దురదృష్టవశాత్తు డిపాజిట్‌దారుడు మరణించినప్పుడు ఖాతాలోని సొమ్మును పొందేందుకు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాంకు ఖాతాకు నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించింది.