సైఫ్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి వైద్యుల అప్‌డేట్ ఇదే..!
- సైఫ్ ఆరోగ్యం మెరుగవుతోందన్న వైద్యులు
- ఆయన నడవగలుగుతున్నారని వెల్లడి
- అలాగే, బాగానే మాట్లాడగలుగుతున్నారన్న డాక్టర్లు
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన లీలావతి ఆసుపత్రి వైద్యులు... "సైఫ్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఆయన బాగానే మాట్లాడగలుగుతున్నారు. అలాగే నడవగలుగుతున్నారు. వెన్ను నుంచి కత్తి మొనను తొలగించాం. గాయాల కారణంగా ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అందుకే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని ఆయనకు చెప్పాం. సైఫ్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌లోకి మారుస్తాం. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని బట్టి డిశార్జ్ చేస్తాం" అని వైద్యులు చెప్పుకొచ్చారు.