కేరళ, తమిళనాడు తీరాలకు నేటి రాత్రి ఉప్పెన ముప్పు.. హెచ్చరికల జారీ
- రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ ముప్పు పొంచి ఉందని ఐఎన్‌సీవోఐఎస్ హెచ్చరిక
- రాత్రి 11.30 గంటలకు తీరంలో అలల తాకిడి భారీగా ఉంటుందన్న అధికారులు
- ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచన
- మళ్లీ ప్రకటన చేసే వరకు బీచ్‌ల వద్దకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు
తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చిన్నచిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలను రాత్రి లోగా తీరానికి చేర్చుకోవాలని సూచించింది. మళ్లీ ప్రకటన చేసే వరకు వరకు పర్యాటకులు ఎవరూ బీచ్‌ల వద్దకు రావొద్దని పేర్కొంది.