హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేవారికి విజయవాడలో ట్రాఫిక్ సమస్య తప్పింది!
- సంక్రాంతి సమయంలో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు
- గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వెళ్లే వారికి తప్పిన ట్రాఫిక్ ఇక్కట్లు
- విజయవాడలోకి వెళ్లకుండా... 30 కిలోమీటర్లు తగ్గిన దూరం
అయితే ఈసారి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గింది. గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ లోనికి రానీయకుండా పోలీసులు గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద మళ్లిస్తున్నారు. ఈ దారి చిన్నఅవుటుపల్లి వద్ద తిరిగి కలుస్తుంది. దీంతో ప్రయాణం కూడా 30 కిలోమీటర్ల మేర తగ్గుతోంది. అలాగే ట్రాఫిక్ జామ్ సమస్య తప్పింది.