వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ నిరాకరణ
- మరియమ్మ హత్య కేసులో జైలుపాలైన మాజీ ఎంపీ
- బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
- ట్రయల్ కోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీం బెంచ్
మరియమ్మ హత్య కేసు..
తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ 2020లో హత్యకు గురైంది. అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ తమను మోసం చేశారని మరియమ్మ బహిరంగంగా దూషించింది. తనకు పెన్షన్ ఆపేశారని, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడింది. దీంతో నందిగం సురేశ్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. మరియమ్మను తీవ్రంగా కొట్టి చంపేశారు. ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని, కేసును పక్కన పెట్టారని మరియమ్మ కుమారుడు ఆరోపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేశ్ ను కలిసి న్యాయం చేయాలంటూ మరియమ్మ కుమారుడు విజ్ఞప్తి చేశాడు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో కేసు దర్యాఫ్తులో వేగం పెంచిన పోలీసులు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.