కేటీఆర్ కు షాకిచ్చిన హైకోర్టు.. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు
--
ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు తరలించారని కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రూ.55 కోట్లు చెల్లించాలంటూ కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో అప్పట్లో అధికారులు ఈమేరకు చెల్లింపులు జరిపారని ఏసీబీ కేసు నమోదు చేసింది.