మన బ్రహ్మోస్ మిస్సైల్ పై ప్రపంచ దేశాల ఆసక్తి

high demand in worldwide on indian mega war weapon
  • భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిధిగా విచ్చేస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు 
  • బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై ప్రధాని మోదీతో చర్చించనున్న ఇండోనేషియా అధ్యక్షుడు
  • స్వయంప్రతిపత్తితో దిశ మార్చుకుని శత్రు లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయగల క్షిపణి బ్రహ్మోస్ 
భారత్ – రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇప్పటికే ఈ క్షిపణిని ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయగా, ఇప్పుడు ఇండోనేషియా, వియత్నాంలు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు కలిసి వచ్చేలా ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు. 

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ నెలలో మన దేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరవుతున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. 

ఈ సందర్భంగా భారత అస్త్రం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై కీలక ఒప్పందం చేసుకోనున్నారని వార్తలు వినబడుతున్నాయి. దీనిపై ఒప్పందం కుదిరితే రెండేళ్లలో భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకు అందించనుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఈ బ్రహ్మోస్ క్షిపణి అంటే మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌కు ఒకింత భయమేనని సమాచారం.  
 
ఈ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటంటే.. అద్భుతమైన వేగం, ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతూ, గాలిలో ఉండగానే తన గమనాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. లాంచ్ చేసిన తర్వాత తన దిశను సర్దుబాటు చేసుకుంటూ స్వయంప్రతిపత్తితో శత్రువుల లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేస్తుంది.  
Go Back to Shorts
indian mega war weapon
Brahmos
Indonesia
pm modi

More Telugu News