న్యూఇయర్ వేడుకలు... రేపు రాత్రి హైదరాబాద్‌లో ఆ ఫ్లైఓవర్లు క్లోజ్
Advertisement

న్యూఇయర్ వేడుకలు... రేపు రాత్రి హైదరాబాద్‌లో ఆ ఫ్లైఓవర్లు క్లోజ్

Flyovers tobe close in IT corridor
  • సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు
  • ఐటీ కారిడార్‌లోని ఫ్లైఓవర్ల మూసివేత
  • రేపు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేత
రేపు రాత్రి న్యూఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు.  మంగళవారం రాత్రి ఐటీ కారిడార్‌లోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇవి మూసివేస్తున్నట్లు చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతారన్నారు.

న్యూఇయర్ సమయంలో మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

మరోవైపు, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ సంఘం ప్రకటించింది. 500 కార్లు, 250 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు

నూతన సంవత్సరాది సందర్భంగా మెట్రో ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేశారు. రేపు అర్ధరాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులను పొడిగిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి సర్వీస్ అర్థరాత్రి 12.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది.
Advertisement
Cyberabad
Hyderabad
Telangana
News Year

More Telugu News