విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్.. ఏర్పాటు చేసిన రాంచరణ్ ఫ్యాన్స్.. చెర్రీకి దక్కిన రికార్డ్!
ఈ నేపథ్యంలో రాంచరణ్‌కు ఆయన అభిమానులు భారీ బహుమతి ఇచ్చారు. విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రాంచరణ్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ కటౌట్‌ను నేడు ఆవిష్కరించనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్‌పై పూలు కురిపిస్తారు. ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, ఓ మూవీస్టార్‌కు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి.