మా హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించొద్దు: అంబటి రాంబాబు

Ambati Rambabu fires on Kutami
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తోందని దుయ్యబట్టారు. వైసీపీపై కోపం ఉంటే తమతో పోరాడాలని... అంతేకాని తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించొద్దని అన్నారు.

వైసీపీ హయాంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అంబటి చెప్పారు. వాలంటీర్లకు ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. బాదుడే బాదుడు అంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 15,485 కోట్ల విద్యుత్ ఛార్జీలు బాదారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని గతంలో చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని చెప్పారు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారని... అప్పులతో ప్రభుత్వాన్ని నడిపే స్థితికి వచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆదాయం పడిపోయిందని అన్నారు. సూపర్ సిక్స్ ఏమయిందని ప్రశ్నించారు.
Go Back to Shorts
Ambati Rambabu
YSRCP

More Telugu News