రేపు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
- విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం
- బందరు రోడ్డులో ఇతర వాహనాలకు అనుమతి లేదన్న పోలీసులు
- నగర ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి
- ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన
రేపు విజయవాడలోని బందర్ రోడ్డుపై బస్సులు, ఆటోలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే ఆ మార్గంలో అనుమతిస్తామని చెప్పారు.
అందరూ ఉదయం 8 గంటల లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దృష్ట్యా విజయవాడ ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.