నా సోదరుడు, డైనమిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశాను: మంచు విష్ణు

Manchu Vishnu met AP minister Nara Lokesh
  • ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తో మంచు విష్ణు భేటీ
  • పలు విషయాలపై చర్చించానన్న మంచు విష్ణు
  • తన సమావేశం ఫలప్రదంగా సాగిందని వెల్లడి
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు నేడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. 

"నా సోదరుడు, ఏపీ డైనమిక్ మంత్రి నారా లోకేశ్ తో సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగింది. వివిధ అంశాలపై చర్చించాను. లోకేశ్ పాజిటివ్ ఎనర్జీ చూస్తే అమోఘం అనిపించింది. నా సోదరుడికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, మరింత శక్తిమంతుడిగా కొనసాగాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ్!" అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. 

అంతేకాదు నారా లోకేశ్ ను కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.
Advertisement
Manchu Vishnu
Nara Lokesh
Amaravati
Andhra Pradesh

More Telugu News