జైలు ముందే డ్యాన్స్.. చూస్తూ ఉండిపోయిన పోలీసులు.. వీడియో వైరల్!
ఓ నేరంలో జైలుకి వెళ్లిన వ్యక్తి శిక్ష తర్వాత బుధవారం కన్నౌజ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అలా కారాగారం నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి జైలు ముందే పోలీసులు, జైలు సిబ్బంది చూస్తుండగానే డ్యాన్స్ చేశాడు. అతడి ఆనందాన్ని అడ్డుకోలేక పోలీసులూ చూస్తూ ఉండిపోయారు. ఆ ఖైదీ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.