Allu Arjun: ఇక వరుసగా సినిమాలు చేస్తా: కొచ్చిలో అల్లు అర్జున్

allu arjun speech at pushpa 2 the rule grand event in kochi
  • తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్
  • మలయాళంలో అభిమానులను పలకరించి ఉత్సాహం నింపిన అల్లు అర్జున్
  • ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానన్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన హీరో అల్లు అర్జున్ .. 2021 వరకూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చారు. 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప మూవీ ఘన విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ చిత్రాలకు అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది.

రెండేళ్ల నుండి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప - 2 ది రూల్ చిత్రం షూటింగ్‌లో అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ మూవీ పుష్ప -2 గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించి అభిమానులను ఖుషీ చేశారు. 

తాజాగా కొచ్చిలో నిర్వహించిన పుష్ప 2 ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు మాటిచ్చాడు. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుండగా, చిత్ర యూనిట్ పలు ప్రముఖ నగరాల్లో వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాట్నా, చెన్నైలో ఈవెంట్స్ చేయగా, తాజాగా కొచ్చిలో ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మలయాళంలో అల్లు అర్జున్ అభిమానులను పలకరించి వారిలో ఉత్సహం నింపారు. 20 ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. 
Allu Arjun
pushpa 2
kochi
Movie News

More Telugu News