మధ్యాహ్నం భోజనం ధరల పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు
- ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ. 5.45 చొప్పున ఖర్చు
- దానిని రూ.6.19కి పెంచిన కేంద్రం
- ఉన్నత పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రోజుకు చేస్తున్న రూ.8.17 వ్యయాన్ని రూ.9.29కి పెంపు
- పెంచిన ధరలు డిసెంబరు 1 నుంచే అమలు
ఈ మేరకు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. పెంచిన ధరలను డిసెంబరు 1 నుంచి అమలు చేయాలని అధికారులను కోరింది.