16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం.. బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం

Australia passes bill to ban young children from social media
  • సామాజిక మాధ్యమాలకు పిల్లల్ని దూరంగా ఉంచే ప్రయత్నం
  • 103 ఓట్లతో బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్
  • సెనేట్ ఆమోదం లభించిన వెంటనే చట్టంగా రూపాంతరం
  • ఆ వెంటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఆదేశాలు
16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలకుండా కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. సెనేట్ కూడా దీనికి ఆమోదం తెలిపితే చట్టంగా రూపాంతరం చెందుతుంది. నేడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. మెజార్టీ పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యగా, 13 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. 

 సెనేట్‌లోనూ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ అల్బనీస్ ఇటీవల పేర్కొన్నారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కుతుంది.
Go Back to Shorts
Ban On Social Media
Australia
Children

More Telugu News