Revanth Reddy: జైలుకెళ్తే సీఎం కావొచ్చని కేటీఆర్ భావిస్తున్నారు.. కానీ ఆ ఛాన్స్ కవిత కొట్టేశారు: రేవంత్ రెడ్డి

Revanth reddy satires on KTR and kavitha
షార్ట్స్‌లో చూడండి
జైలుకెళ్తే ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ భావిస్తున్నట్లుగా ఉందని, కానీ కేసీఆర్ కుటుంబంలో ఆ ఛాన్స్ ఆయన చెల్లి  కవిత కొట్టేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం అదానీ సంకలో దూరిందని విమర్శించారు. కానీ ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పలు ప్రాజెక్టులు కట్టబెట్టారని వివరించారు. వాటిపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేటీఆర్ జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు.

'నేను మొన్న ఓ పెపర్లో చూశాను... జైలుకు వెళ్లి వారంతా (సీఎం) అయ్యారని భావిస్తున్నాడు. ఆ లెక్కన మొదట వారి (కేటీఆర్) చెల్లెలు జైలుకు వెళ్లారు. అలా కూడా కేటీఆర్‌కు అవకాశం రాదు. అలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఇప్పటికే ఆ ఛాన్స్ ఆయన చెల్లెలు కొట్టేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆ ఫ్యామిలీలో పోటీని తట్టుకోలేక మాపై ఏడుపు' అని సీఎం మండిపడ్డారు. కేటీఆర్ అమెరికాలో చదువుకున్నాడు... పదేళ్లు మంత్రిగా పని చేశాడు... కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు.

మహారాష్ట్రలో గొప్ప విజయం సాధించామని బీజేపీ చెబుతోందని, కానీ రెండు లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తించాలన్నారు. కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, బెంగాల్‌లో ఆరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఎక్కడా గెలవలేదన్నారు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం మరోసారి నెగ్గింది... ఝార్ఖండ్‌లో తమ ప్రభుత్వం మరోసారి నెగ్గింది... ఇందులో బీజేపీ సంబరాలు చేసుకోవడానికి ఏముందని ప్రశ్నించారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
Telangana
BJP

More Telugu News